సంక్రాంతి సీజన్‌లో విడుదలకు సిద్దమవుతున్న నాలుగు చిత్రాల్లో మూడు చిత్రాల సెన్సార్ కూడా పూర్తయింది. 'డిక్టేటర్, ఎక్స్‌ప్రెస్‌రాజా, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాల రిలీజ్ పోస్టర్స్, టీవీ యాడ్స్ కూడా డేట్ ఫిక్స్ చేస్తూ టీవీ చానెల్స్‌లో పబ్లిసిటీ మొదలైంది. కానీ ఇప్పటికీ ఎన్టీఆర్ నటించనున్న 'నాన్నకు ప్రేమతో' సినిమా ఇంకా సెన్సార్‌కు వెళ్లలేదు.నేడో రేపో ఈ చిత్రం కూడా సెన్సార్‌కు వెళ్లనుంది. 'డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాలకు యు/ఎ సర్టిఫికేట్ లభించగా, 'ఎక్స్‌ప్రెస్‌రాజా'కు క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. మరి ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్‌బోర్డ్ ఎలాంటి సర్టిఫికేట్ ఇస్తుందో వేచిచూడాల్సివుంది. కాగా 'నాన్నకు ప్రేమతో' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమంలో హాట్ సీట్ ఎక్కాడు. ఈ ప్రోగ్రాంలో ఎన్టీఆర్ 12లక్షల 50వేలు గెలుచుకున్నాడు. ఈ మొత్తాన్ని ఎన్టీఆర్ విరాళం ప్రకటించాడు. సగం మొత్తం బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి , మరో సగం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు విరాళం ప్రకటించాడు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఎన్టీఆర్ ట్రస్ట్ చంద్రబాబు సమక్షంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో చంద్రబాబు, బాలయ్యలతో జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధాలు సరిగాలేవనే వార్తల నేపథ్యంలో ఆయన వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్‌లకు ఈ విరాళం ప్రకటించడం చర్చనీయాంశం అయింది.