శ్రీమంతుడు సక్సెస్ తర్వాత మరింత ఉత్సాహంగా బ్రహ్మూెత్సవం షూటింగ్‌లో పాల్గొంటున్న మహేష్ కొద్దిరోజులు సెలవు తీసుకున్న విషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్, దుబాయ్‌లో న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకొని ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు మహేష్. దుబాయ్‌లోని వరల్డ్ ఫేమస్ బూర్జ్ అల్ అరబ్, ప్రపంచంలోకెల్లా ఎత్తయిన బూర్జ్ ఖలీఫా కట్టడాన్ని చూడడం వల్ల తనకు, తన కుటుంబానికి గొప్ప మధురానుభూతి కలిగిందని చెప్తున్నాడు మహేష్.
బూర్జ్ అల్ అరబ్ హోటల్ సిబ్బంది తమపై చూపిన ప్రత్యేకమైన శ్రద్దని ఎప్పటికీ మర్చిపోలేమని, ఆ హోటల్ యాజమాన్యం తాము వుంటున్న రూమ్‌కే శాంటాక్లాజ్‌ని పంపడం ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. తన ఫ్యామలీ టూర్‌ని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ వచ్చిన మహేష్ చెన్నయ్‌లో స్టార్ట్ అయ్యే బ్రహ్మూెత్సవం షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.