Advertisementt

ఛార్మీ మత్తు దిగని పూరీ!

Sun 10th Jan 2016 12:35 PM
puri jagannath office,staff removed,charmi  ఛార్మీ మత్తు దిగని పూరీ!
ఛార్మీ మత్తు దిగని పూరీ!
Advertisement
Ads by CJ

ఛార్మీ ఏ నిమిషంలో పూరీ జగన్నాథ్ ఆఫీసులో అడుగుపెట్టిందో తెలియదు గానీ, అప్పటి నుండీ పూరీ చుట్టూరా ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ చుట్టుముడుతోంది. ముందుగా చిరంజీవి సినిమా చాన్స్ చేజారింది. అటు తరువాత జ్యోతిలక్ష్మి, లోఫర్ వరసగా దెబ్బేసాయి. ఇక ఇప్పుడేమో ఈయన ఆఫీసులో ఏళ్ళ నుండి పని చేస్తున్న సుమారు పాతిక మంది స్టాఫ్ పూరీ దెబ్బకు ఒకేసారి విలవిల్లాడిపోయారు. అవును, ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు, ఆఫీసులో పనిచేస్తున్న 25 మందికి పూరీ గారు ఉద్వాసన పలికారు. ఆఫీసులో ఉండే ప్యూన్ దగ్గరి నుండి ముఖ్యమైన స్టాఫ్ వరకు అందరికీ పూరీ లెక్కలు చూసి బయటికి పంపించేసారు. కొద్ది వారాల క్రితమే ఛార్మీని గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అంటూ అరిచిన పూరీ మరోసారి తన విశ్వరూపం చూపారు. ఇంతలా పూరీ డెసిషన్ తీసుకోవడం వెనక బలమైన కారణం ఉండకపోదు. రెండు మూడు నెలల క్రితమే స్టాఫ్ మొత్తానికి వార్నింగ్ ఇచ్చి, ఎవరి పని వారు సరిగ్గా చేయాలని భయంలో పెట్టె ప్రయత్నం చేసారు. బట్ బాస్ మాటకు విలువనీయకుండా ఎవరికి తోచినట్టు వారు బిహేవ్ చేయడంతో పూరీకి చిర్రెత్తుకొచ్చి ఈసారి నో ఎక్స్ క్యూజెస్ బేసిస్ మీద ఊడ్చిపారేశారు. తొందరలోనే వీరి స్థానాలను వేరే వారితో భర్తీ చేస్తాను అంటూ పూరీ ఓపెన్ గానే చెబుతున్నారు. ఇదంతా ఛార్మీ వచ్చినప్పటి నుండే జరుగుతోందని, తమ తప్పేమీ లేదని కొందరు పూరీకి సంజాయిషీ ఇవ్వబోయినట్టు కూడా తెలుస్తోంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ