Advertisementt

సురేష్‌బాబు సైతం అదే బాటలో!

Sat 09th Jan 2016 02:26 PM
suresh babu,suresh babu into acting,tony dsouza,ajahar movie,ajaruddin biography  సురేష్‌బాబు సైతం అదే బాటలో!
సురేష్‌బాబు సైతం అదే బాటలో!
Advertisement
Ads by CJ

స్వర్గీయ మూవీ మెఘల్‌ డాక్టర్‌ డి.రామానాయుడు వారసులుగా విక్టరీ వెంకటేష్‌ నటనవైపు దృష్టి సారించి స్టార్‌గా ఎదిగాడు. ఆయన సోదరుడు సురేష్‌బాబు మాత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి నిర్మాతగా టాప్‌ పొజిషన్‌కు చేరాడు. కేవలం నిర్మాతగానే కాదు... పంపిణీదారునిగా కూడా ఆయన సక్సెస్‌ అయ్యాడు. కాగా రామానాయుడు నిర్మాతగా ఉన్నప్పుడు పలు చిత్రాల్లో నటునిగా మెరిశారు. అయితే ఇన్ని సినిమాలు నిర్మించినప్పటికీ సురేష్‌బాబు మాత్రం ఇప్పటివరకు కెమెరా ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఆయన నటుడిగా మారాడు. ప్రముఖ క్రికెటర్‌ అజారుద్దీన్‌ జీవిత గాధ ఆధారంగా బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్‌ 'అజహర్‌'. టోనీడిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజారుద్దీన్‌ పాత్రను ఇమ్రాన్‌హష్మీ నటిస్తున్నాడు. టోనీడిసౌజా, సురేష్‌బాబుల మధ్య చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ఓ కీలకపాత్రకు సురేష్‌బాబుని టోనీ అడిగాడట. ఆయన మాట కాదనలేక సురేష్‌బాబు కూడా ఈ ఆఫర్‌కు ఓకే చెప్పాడని సమాచారం. కాగా ఇందుకు సంబంధించిన సురేష్‌బాబుపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను ఆల్‌రెడీ షూట్‌ చేశారని తెలుస్తోంది. ఇన్ని తెలుగు సినిమాలను నిర్మించినప్పటికీ వెండితెర ముందుకు రాని సురేష్‌బాబు బాలీవుడ్‌ మూవీ ద్వారా నటునిగా మారడం ఆశ్చర్యకరమే అని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ