చిరంజీవి 150వ సినిమాకు అతి త్వరలోనే ముహూర్తం ఫిక్స్ కాబోతోంది. తమిళంలో ఇరగేసిన కత్తి చిత్రమే మన మెగా సినిమాకు సరైన సబ్జెక్టు. అందుకే ఎటువంటి ఆలస్యం చేయకుండా వీవీ వినాయక్ గారిని రంగంలోకి ప్రవేశపెట్టి మిగతా పనులను వేగవంతం చేసారు నిర్మాత రామ్ చరణ్. ఇక చిరంజీవి పక్కన ఎవరైతే హీరోయినుగా బాగుంటుంది అన్న క్వశ్చన్ కూడా రాకపోలేదు. అందుకే నయనతారను సంప్రదించి ఆమె కాల్షీట్స్ కూడా లాక్ చేసి మరింత వేగం పెంచారు. తమిళంలో వంద కోట్లు సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోనే కాక హిందీ వారిని కూడా విపరీతంగా ఆకర్షించింది. అక్షయ్ కుమార్ ఈ కథను చేయడానికి మురుగదాస్ గారితో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. విశేషం ఏమిటంటే హిందీ వర్షనుకు కూడా మురుగనే దర్శకత్వం వహించనున్నారు. ఇందుకోసం అక్షయ్ సరసన హీరోయిన్ వేటకు కూడా పెద్ద సమయమేమీ పట్టలేదు. బాలివుడ్ అంతటా దుమ్ము రేపుతున్న తాప్సీని మొదటి మీటింగులోనే ఫైనల్ చేసారని టాక్. ఇప్పటికే అక్షయ్ చేసిన బేబీ సినిమాలో అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో అద్భుతంగా నటించిన తాప్సీ ఈసారి కూడా జాక్ పాట్ కొట్టేసింది. రానాతో జలాంతర్గామి చిత్రం ఘాజీ, పీకు దర్శకుడు షూజిత్ సర్కార్ మరో సినిమా ఆల్రెడీ తాప్సీ సైన్ చేసింది.