సాధారణంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరో... ఆమె ఇండియా టాప్ హీరోయిన్ అవుతుంది. మరి బాలీవుడ్ నెంబర్‌వన్ హీరోయిన్ విషయంలో ఏ హీరోయిన్ చిత్రం బ్లాక్‌బస్టర్ అయిందో మరో బ్లాక్‌బస్టర్ వచ్చే దాకా ఆమెనే టాప్ హీరోయిన్‌గా ఇంతకాలం బాలీవుడ్ భావిస్తూ వచ్చింది. అయితే బాక్సాఫీస్ గణాంకాలు, లెక్కలు చూస్తే మాత్రం బాలీవుడ్ టాప్‌హీరోయిన్ దీపికా పడుకోనే అని బాలీవుడ్ విశ్లేషకులు పక్కాగా చెబతున్నారు. తాజాగా ఆమె నటించిన 'బాజీరావ్‌మస్తానీ' చిత్రం కూడా సూపర్‌హిట్ కావడంతో ఇక ఆమెకు తిరుగేలేకుండా పోయింది. దాంతో ఆమె తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసింది. ఇలా రెమ్యూనరేషన్‌పరంగా చూసుకున్నా కూడా దీపికాదే టాప్ చెయిర్ అని ఒప్పుకోవాలి. గత మూడేళ్లలో ఆమె 9 సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. ఒక్క 'తమాషా' చిత్రం మాత్రమే ఫ్లాప్ అయింది. ఇప్పటివరకు సినిమాకు 10కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఆమె ప్రస్తుతం 15కోట్లు వసూలు చేస్తోంది. క్రేజ్ ఉన్నప్పుడు డిమాండ్ చేయడంలో తప్పేంలేదని అంటోంది ఈ కన్నడ కస్తూరి. తాజాగా ఆమె ఓ హాలీవుడ్ సినిమాకు కూడా కమిట్ అయింది. ఆ చిత్రం కూడా హిట్ అయితే ఇక హాలీవుడ్ రేంజ్‌లో ఆమె రెమ్యూనరేషన్ ఎంతగా పెరుగుతుందా? అని బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తిగా గమనిస్తున్నారు.