అసలు సినిమాల్లోకే అనుకోకుండా వచ్చాననీ, నటుడిని కావాలని ఏ రోజు అనుకోలేదని చెప్పే పవన్ కళ్యాణ్ ఆ మాటలకు తగ్గట్టుగానే ఓ సినిమా ఒప్పుకున్నాడంటే కనీసం ఏడాది పైదాకా సెట్స్ మీదే నిలిచిపోతుంది. గబ్బర్ సింగ్ మొదలు గోపాల గోపాల, ఇప్పుడేమో సర్దార్ గబ్బర్ సింగ్. ఒకదాన్ని మించి ఇంకొకటి సాగుతున్నాయి. ఒకవేళ కథ, కథానాలు పకడ్బందీగా లేకపోవడం వల్ల ఇలాంటి అసందర్భ జాప్యాలు జరుగుతాయి అనుకుందామంటే అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్టే ఒప్పుకోకపోతే సరిపోద్ది కదా. మరి కొందరు అనుకునే విషయం ఏమిటో మనకు బాగా తెలిసిందే. ప్రొడక్షన్ విషయాల్లో పవన్ కళ్యాణ్ తరుచుగా ఇంటర్ ఫియర్ అవుతుండడం, షూటింగ్ షెడ్యూల్సును ఎప్పుడూ సరిగ్గా ఫాలో అవకపోవడం, షూటింగ్ రోజుల్లో కూడా రాజకీయపరమైన, వ్యక్తిగతమైన కార్యక్రమాలకు చోటివ్వడం పవన్ గారికి పరిపాటి. సినిమా హిట్టయినా ఫ్లాపయినా అనుకున్న తేదీకి విడుదల అయినా కాకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ టీవీ షో చేయాలని పవన్ కళ్యాణ్ గనక నిజంగా పూనుకుంటే ఇలాంటి ప్లానింగుతో వెళ్తే అవమానభారం తప్పదు. కాన్సెప్టు నచ్చి ఒకటో, రెండో ఎపిసోడ్స్ పూర్తి చేసి మిగిలిన షూటింగ్ మళ్ళీ తరువాత పెట్టుకుందామంటే, వారం తిరిగేలోపే నాలుగో ఎపిసోడ్ వచ్చే సమయానికి ఫుటేజ్ లేకపోతే, టీవీ యాజమాన్యాలు గొల్లుమంటాయి. సినిమాకంటే టీవీ షో రన్ చేయడం యజ్ఞ్యం లాంటిది. అందుకే పవన్ కళ్యాణ్ గారు టీవీ షో చేస్తానని ముక్తసరిగా ఒప్పుకుంటే సరిపోదు, స్క్రిప్ట్ సంసిద్దంగా ఉంటె పది పదిహేను రోజులు మిగతా పనులన్నీ వదులుకోవాలి. అంత తీరిక పవన్ గారికి ఉందంటారా?