Advertisementt

బాలయ్య ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు..!

Fri 08th Jan 2016 02:11 PM
balakrishna fans,jai balayya,krishnagaadi veera premagadha movie,nani movie title,balayya fans  బాలయ్య ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు..!
బాలయ్య ఫ్యాన్స్‌ బాగా హర్టయ్యారు..!
Advertisement
Ads by CJ

'అందాల రాక్షసి' దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో నాని చేస్తున్న చిత్రానికి..కొంత కాలంగా 'జై బాలయ్య' అనే టైటిల్‌ వినబడిన సంగతి తెలిసిందే. గత రెండు రోజుల క్రితం వరకు ఇదే టైటిల్‌ ఈ సినిమాకు ఫిక్స్‌ అవుతుందని పక్కాగా సమాచారం జరిగింది. కానీ ఈ చిత్రానికి 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' అనే టైటిల్‌ని అఫిషీయల్‌గా రిలీజ్‌ చేయడంతో..బాలయ్య ఫ్యాన్స్‌ ఒక్కసారిగా హర్ట్‌ అయినట్లుగా తెలుస్తుంది. నాని చేతి మీద బాలయ్య ఉండటంతో..'జై బాలయ్య'తో..నాని మా వాడే అని బాలయ్య ఫ్యాన్స్‌ ఢంకా మ్రోగించారు. సడెన్‌గా టైటిల్‌ ఇలా రివీల్‌ అవ్వడంతో..నిజంగానే వారు హర్టయి ఉండొచ్చు. ఎందుకంటే ఇండస్ట్రీలో చిన్న చిన్న హీరోలు..మేము ఆ హీరో ఫ్యాన్‌ అని చెప్పుకున్నప్పుడు..ఆయా హీరోల ఫ్యాన్స్‌ ఎంత గర్వంగా ఫీలవుతారో తెలియంది కాదు. గతంలో రవితేజ, శ్రీకాంత్‌లతో పాటు నెంబర్‌ ఆఫ్‌ హీరోస్‌ మేము చిరంజీవి అభిమానులం అని..చెబుతుండే వారు. అలాంటి ఛాన్సే ఇప్పుడు బాలయ్యకి వచ్చిందని..బాలయ్య బాబు హవా..ఇప్పుడు బాగా నడుస్తోందని ఫ్యాన్స్‌ చాలా సంతోషంగా ఉన్న సమయంలో..ఇలాంటి న్యూస్‌ రావడం..వారికి కొంచెం కష్టంగానే ఉండొచ్చు. మరి సినిమాలోనైనా నాని..బాలయ్య ఫ్యాన్‌గా ఉంటాడో..లేదో..?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ