Advertisementt

ఇది.. గోపీచంద్‌ కి సరైన టైటిల్!

Fri 08th Jan 2016 01:46 PM
gopichand,soukhyam,loukyam,ballem movie,gopichand ballem,nayanthara,b gopal  ఇది.. గోపీచంద్‌ కి సరైన టైటిల్!
ఇది.. గోపీచంద్‌ కి సరైన టైటిల్!
Advertisement
Ads by CJ

'లౌక్యం'తో హిట్‌ కొట్టి, 'సౌఖ్యం'తో దెబ్బ తిన్నాడు గోపీచంద్‌. ఇప్పుడు గోపీచంద్‌ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. త్వరలోనే 'ఆక్సిజన్‌' సెట్స్‌పైకి వెళ్తున్నా.... అది ప్రయోగాత్మక చిత్రం కావడం గమనార్హం. అందుకే అర్జెంట్‌గా తన పాత సినిమా బూజు దులుపుతున్నాడు. బి.గోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా మొదలై ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇంకో పదిశాతం షూటింగ్‌ జరిపితే సినిమా పూర్తవుతుంది. ఇప్పుడా సినిమాను బయటకు తీసుకొస్తున్నాడు గోపీచంద్‌. ఇందులో గోపీచంద్‌ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం రూపొందింది. ఇందులో గోపీచంద్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. మొదట్లో ఈ చిత్రానికి 'జగన్మోహన్‌ ఐ.పి.ఎస్‌' అనే టైటిల్‌ను అనుకున్నారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదల చేస్తే బాగా మార్కెట్‌ ఉంటుందని గోపీ నమ్మకం. పక్కా మాస్‌ అండ్‌ యాక్షన్‌ చిత్రం కావడం, ఇందులో నయనతార నటిస్తుండటం, బి.గోపాల్‌ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రంపై ఇంతకాలం ఇంట్రస్ట్‌ చూపించని గోపీ.. ఇప్పుడు హడావుడిగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నాడట. ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ చిత్రాన్ని పి.వి.పి. సినిమా సంస్థ టేకప్‌ చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి 'బల్లెం' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. గొపీచంద్‌ తన సున్నా సెంటిమెంట్‌ను ఈ సినిమాతోనూ కొనసాగిస్తున్నాడన్న మాట..!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ