Advertisementt

జోరు పెంచిన 'అల్లుడుశీను'..!

Fri 08th Jan 2016 01:38 PM
bellamkonda srinivas,alludu seenu,speedunnodu,bheemaneni srinivas  జోరు పెంచిన 'అల్లుడుశీను'..!
జోరు పెంచిన 'అల్లుడుశీను'..!
Advertisement
Ads by CJ

వాస్తవానికి నిర్మాత బెల్లంకొండ సురేష్‌ తనయుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ వినాయక్‌ దర్శకత్వంలో 'అల్లుడు శీను' చిత్రం ద్వారా గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. 'అఖిల్‌' సినిమాకు ముందు భారీ బడ్జెట్‌తో అరంగేట్రం చేసిన హీరోగా ఆయన పేరునే చెప్పాలి. కానీ ఈ సినిమా నటునిగా సాయికి మంచి పేరు తెచ్చినప్పటికీ ఆర్థికంగా మాత్రం భారీ లోటునే మిగిల్చింది. కాగా 'అల్లుడు శీను' తర్వాత ఆయన రెండేళ్ల గ్యాప్‌ తీసుకొని ప్రస్తుతం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో 'స్పీడున్నోడు' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ హిట్‌ మూవీ 'సుందరపాండ్యన్‌'కు రీమేక్‌. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలకు సిద్దమవుతోంది. తాజాగా ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్‌ నుండి సెట్స్‌పైకి వెళ్లుతుందని సమాచారం. ఇదే జరిగితే బాలకృష్ణ తన 100వ చిత్రం కోసం అంటే బోయపాటి శ్రీను కోసం కొంతకాలం వెయిట్‌ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ రెండు చిత్రాలే కాక యువ దర్శకుడు కొండా విజయ్‌కుమార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌.ఇలా వరుస చిత్రాలతో సాయి బిజీగా మారుతున్నాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ