Advertisementt

ఎన్టీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందా..?

Fri 08th Jan 2016 12:12 PM
ntr,nannaku prematho,balakrishna,sharvanand,nagarjuna  ఎన్టీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందా..?
ఎన్టీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందా..?
Advertisement
Ads by CJ

తనకంటే ఆలస్యంగా సినిమా రంగంలోకి హీరోలుగా ప్రవేశించిన రామ్‌చరణ్‌, బన్నీ వంటి వారు కూడా ఇప్పటికే 50కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించారు. కానీ నిన్నటివరకు ఆ క్లబ్‌లో చేరని హీరోలుగా ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించేవి. ఆ ఇద్దరు ఎన్టీఆర్‌, ప్రభాస్‌. కానీ ఇటీవలే 'బాహుబలి'తో ప్రభాస్‌ 50కోట్లేం ఖర్మ..? ఏకంగా 500కోట్ల క్లబ్‌లో చేరిపోయి సంచలనాలు రిపీట్‌ చేశాడు. ఇక మిగిలింది యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఒక్కడికే 50కోట్ల మార్క్‌ ఇంకా చేతికి అందలేదు. 'బాద్‌షా, టెంపర్‌' చిత్రాలు ఈ మైల్‌స్టోన్‌కు దగ్గరగా వచ్చినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేదించలేకపోయాయి. తాజాగా ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో 50కోట్ల క్లబ్‌పై కన్నేశాడు. కానీ అబ్బాయ్‌ ఆశలకు బాబాయ్‌ బాలకృష్ణ, నాగార్జున, శర్వానంద్‌లు గండికొట్టేలా కనిపిస్తున్నారు. నాలుగు చిత్రాల పోటీలో ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఎన్ని ధియేటర్లలో రిలీజ్‌ కానుంది అనే అంశంపైనే ఈ లక్ష్యం ఆధారపడివుంది. అనుకున్నని థియేటర్లు దొరికితే మొదటివారంలోనే ఆ టార్గెట్‌ను ఛేదించడం ఎన్టీఆర్‌కు పెద్దగా ఇబ్బంది కాబోదు. అందులోనూ ఇది సంక్రాంతి సీజన్‌ కాబట్టి అది అసాధ్యమేమీ కాదు. కానీ పోటీలో ఉన్న ఇతర హీరోల చిత్రాలను చూస్తే ఎన్టీఆర్‌ ఆశయాలకు ఇతరహీరోలు గండికొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ