హీరో, హీరోయిన్ల స్టైలింగ్ మీదే లక్షలకు లక్షలు డబ్బులు పోయడం ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్. హీరో అంటే సింపులుగా చొక్కా తగిలించుకుని, తల దువ్వుకొని, నీటుగా వచ్చేస్తే ఒప్పుకునే రోజులు పోయాయి. దేశదేశాలు తిరిగి మీసం, గెడ్డం, నెత్తి మీద జుట్టును రకరకాల వింత అలంకరణలలో బంధిస్తే గాని ఈయనే హీరో అని మనం కూడా ఒప్పుకోలేని పరిస్థితి దాపురించింది. అందుకే జూనియర్ ఎన్టీయార్ ఏకంగా పది, పన్నెండు నెలలు బ్రెజిల్ స్టైల్ హెయిర్ కట్, మీసం, గెడ్డంతో బాడీ మీదున్న అసలు బట్టల బరువు కన్నా మొహం మీదే ఎక్కువ భారం మోసుకుంటూ నాన్నకు ప్రేమతో కోసం కష్టపడ్డాడు. సుకుమార్ సినిమాలలో హీరోలు సాధారణ జనాల నుండి వేరయినట్టుగా ఉంటారు కాబట్టి ఎన్టీయార్ కూడా పాత్రకు అనుగుణంగా చాలా శ్రమపడ్డాడు. మొన్నే నాన్నకు ప్రేమతో ఫైనల్ షూటింగ్ అయిపోయి గుమ్మడికాయ కొట్టడంతో బుడ్డోడు బార్బర్ షాపుకు పరుగులు తీసినట్టున్నాడు. గెడ్డం, మీసం, పైన హెయిర్ అన్నీ కట్ చేయించేసి నీటుగా తన తదుపరి సినిమా జనతా గ్యారేజీ కోసం కసరత్తు మొదలు పెట్టాడు. బ్యాక్ టూ స్లిమ్ అండ్ స్మార్ట్ లుక్.