'బ్రూస్‌లీ' పరాజయం తర్వాత రామ్‌చరణ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఆయన తాజాగా తమిళ రీమేక్ 'తని ఒరువన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవల యువ దర్శకుడు మేర్లపాక గాంధీ చరణ్‌కు ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్టోరీని వినిపించాడట. చరణ్‌కు కూడా ఆయన చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చిందట. కానీ ఇంకా ఈ చిత్రానికి ఆయన ఓకే అని మాత్రం చెప్పలేదు. సంక్రాంతి తర్వాత తన నిర్ణయం చెబుతానని అన్నాడట. ఇప్పటికే 'వెంకటాద్రిఎక్స్‌ప్రెస్' వంటి సూపర్‌హిట్ చిత్రంతో దర్శకునిగా మారిన మేర్లపాక గాందీ దర్శకత్వం వహిస్తున్న 'ఎక్స్‌ప్రెస్‌రాజా' చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా
నటిస్తుండగా, యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం సూపర్‌హిట్ అయితే మాత్రం రామ్‌చరణ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించడం ఖాయమని చెప్పవచ్చు. కాగా చరణ్ ఒప్పుకుంటే ఈ చిత్రాన్ని కూడా యూవి క్రియేషన్స్ సంస్థే నిర్మించాలని భావిస్తోందిట. గత కొంతకాలంగా యూవి క్రియేషన్స్ అధినేతలు రామ్‌చరణ్‌తో ఎలాగైనా ఓ చిత్రం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి మేర్లపాకగాంధీ కల నెరవేరాలంటే అది 'ఎక్స్‌ప్రెస్‌రాజా' సినిమా ఫలితం మీదే ఆధారపడి ఉందని వేరేచెప్పనక్కర్లేదు.