Advertisementt

చిరంజీవికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు!!

Thu 07th Jan 2016 11:35 AM
chiranjeevi,allu ramalingaiah national award to raghavendra rao,pawan kalyan,attarintiki daaredi dialogue,mega star  చిరంజీవికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు!!
చిరంజీవికి ఎక్కడ తగ్గాలో బాగా తెలుసు!!
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అత్తారింటికి దారేది చిత్రంలోని డైలాగ్‌ను ఇప్పుడు చిరంజీవి తూచా తప్పకుండా పాటిస్తున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు.'ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు'. ఇది డైలాగ్‌. పై ఫోటోలో చిరంజీవిని చూసిన ఎవ్వరైనా ఈ డైలాగ్‌ను గుర్తుకు తెచ్చుకుంటారు. రాజకీయాల్లో చిరంజీవిది కాస్త వెనకడుగు అయ్యిండొచ్చు..కానీ సినిమా పరంగా చిరంజీవి..ఇప్పటికీ రారాజే. అందుకే తనకు అంతగా కలిసిరాని పాలిటిక్స్‌ నుండి బయటపడేందుకు..మళ్ళీ ముఖానికి రంగేయబోతున్నాడు చిరు. త్వరలో ఓ పూర్తి కమర్షియల్‌ చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్న చిరంజీవి..తను మెగాస్టార్‌ అవ్వడానికి కారణమైన తన గురువు రాఘవేంద్రరావుగారిని అల్లు రామలింగయ్య అవార్డుతో సత్కరిస్తూ..ఇలా పాదాభివందనం చేసి..తన రీ-ఎంట్రీకి అనుమతి, ఆశీర్వచనాలు తీసుకున్నాడని..అందుకే ఇలా తగ్గి చూపించాడని..హాజరైన అతిధులు, ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ