Advertisementt

ఇద్దరు యంగ్‌హీరోలు డ్రాప్‌ అయ్యారు..!

Thu 07th Jan 2016 11:11 AM
raj tarun,seethamma andalu ramayya sithralu,nagashourya,kalyana vaibhogame  ఇద్దరు యంగ్‌హీరోలు డ్రాప్‌ అయ్యారు..!
ఇద్దరు యంగ్‌హీరోలు డ్రాప్‌ అయ్యారు..!
Advertisement
Ads by CJ

వరుస హిట్లతో ఉన్న హీరో రాజ్‌తరుణ్‌. ఈ యంగ్‌హీరో నటిస్తున్న కొత్త చిత్రం 'సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు' రీసెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి దర్శకుడు శ్రీనివాస్‌ గవిరెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 10న విడుదల చేసి, సినిమాను జనవరి 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్‌ పరిచయం అవుతోంది. ఈ సినిమాకు 'భలే భలే మగాడివోయ్‌' సినిమాకు సంగీతం అందించిన గోపీసుందర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగాలని భావించింది. కానీ పెద్ద హీరోల సినిమాల మద్య నలిగిపోతాడేమో అనే అనుమానంతో నెలాఖరుకు వస్తున్నారు. ఇక 'అలా మొదలైంది' తో హిట్‌ను అందుకున్న దర్శకురాలు నందినిరెడ్డి తాజా చిత్రం 'కళ్యాణవైభోగమే'. నాగశౌర్య, మాళవికనాయర్‌లు జంటగా నటించిన ఈ చిత్రాన్ని కూడ సంక్రాంతికి తేవాలని భావించి చివరకు ఈనెల 22న విడుదల చేయడానికి నిర్ణయించారు. ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణ్‌కోడూరి ఈ చిత్రానికి సంగీతం అందించగా, శ్రీరంజిత్‌ మూవీ బేనర్‌పై కే.ఎల్‌. దామోదర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో ఒకప్పటి అందాల భామ రాశి హీరోయిన్‌ మాళవికనాయర్‌కు తల్లిపాత్రలో నటిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ