Advertisementt

నారి నారి నడుమ సునీల్‌..!

Thu 07th Jan 2016 07:31 AM
sunil,krishnashtami,sushma raj,richa panai,eedu gold ahe  నారి నారి నడుమ సునీల్‌..!
నారి నారి నడుమ సునీల్‌..!
Advertisement
Ads by CJ

2015ని ఖాళీగా వదిలేసిన సునీల్‌ 2016లో ఆ గ్యాప్‌ను బ్యాలన్స్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ప్రదమార్ధంలోనే రెండు సినిమాలను విడుదల చేయాలని ప్లాన్‌ చేశాడు. దిల్‌రాజు నిర్మాణంలో వాసువర్మ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'కృష్ణాష్టమి' ఇందులో ఒకటి. సరికొత్త ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెల 9వ తేదీన రాజమండ్రిలో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఇందులో నిక్కి గట్రాని, డింపుల్‌ చోపడే హీరోయిన్స్‌గా నటిస్తుండగా, దినేష్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఆయన వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలోని చిత్రాన్ని కూడా సిద్దం చేస్తున్నాడు. మరోపక్క వీరుపోట్ల సినిమా పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వీరిద్దరి కలయిలో రూపొందే చిత్రానికి 'ఈడు గోల్డ్‌ ఎహే' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేసినట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్స్‌ ఎంపిక జరిగింది. 'మాయ' ఫేమ్‌ సుష్మారాజ్‌ను సునీల్‌కి జోడీగా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా రిచాపనాయి నటిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ