సుకుమార్ సినిమాలలో హీరోయిన్లు కేవలం గ్లామర్ బొమ్మల్లా కాకుండా తమకు ఇచ్చినంతలో సినిమాకు ప్రాధాన్యం చేకూర్చే పాత్రల్లో కనపడుతుంటారు. అనురాధ మెహత, కాజల్ అగర్వాల్, తమన్నా, కృతి సానన్ తరువాత ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో రానున్న నాన్నకు ప్రేమతోలో హీరోయిన్ అయిన రకుల్ మొట్టమొదటిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. నిజానికి సుకుమార్ గారు తనలోని నటనని, నటిని తనకు ఈ సినిమాతోనే మొదటగా పరిచయం చేసారని పాటల పండగ రోజే రకుల్ మనసులోని మాట ద్వారా కృతజ్ఞ్యతలు తెలుపుకుంది. ఇక ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్ చెప్పిన తరువాత అభిమానులతో ఆ ఎక్స్ పీరియన్స్ పంచుకుంది. ఫస్ట్ టైం నా గొంతుతో నా పాత్రకు నప్పేట్టుగా మాట్లాడుతున్నాను. దయచేసి వాక్దోశాలు ఉంటే క్షమించండి అంటూ ముందే తన ప్రయత్నాన్ని ఆదరించమని కోరుకుంది. గడుసు పిల్లే... రేపు ఉచ్చారణలో తప్పులున్నా మనం తప్పుపట్టడానికి వీలు లేదన్న మాటేగా!