మాస్‌మహారాజా రవితేజ నటించిన 'కిక్2'లో ఆయన పాత్ర పేరు రాబిన్‌హుడ్. ఇప్పుడీ పేరే ఆయన సినిమాకు టైటిల్‌గా మారిపోయింది. చక్రి అనే కొత్త దర్శకునితో ఓ సినిమా చేయడానికి రవితేజ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రంజిత్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి గాను 'రాబిన్‌హుడ్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. కాగా దిల్‌రాజు నిర్మాతగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే 'ఎవడో ఒకడు' చిత్రం పూర్తయిన తర్వాత ఈ 'రాబిన్‌హుడ్' పట్టాలెక్కనుంది. కానీ రెమ్యూనరేషన్ విషయంలో దిల్‌రాజుకు రవితేజకు పొరపొచ్చాలు వచ్చాయని, 'కిక్2'లాంటి డిజాస్టర్ తర్వాత కూడా తన 'బెంగాల్‌టైగర్' బాగా కలెక్షన్లు సాధించడం దీనికి ఉదాహరణగా చెబుతోన్న రవితేజ 8కోట్ల రెమ్యూనరేషన్ పట్టుబడుతున్నాడని, కానీ దిల్‌రాజు మాత్రం 6కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పడంతో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోందని, అంతేగాక సెకండాఫ్‌లో స్టోరీ చాలా వీక్‌గా ఉందని కూడా రవితేజ భావిస్తుండటంతో ఈ చిత్రం షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.