వరస పెట్టి దెబ్బ మీద దెబ్బలాగా, పుండు మీద కారంలాగా ఒక దాని వెంట ఇంకొకటి ఆయా రామ్ గయా రామ్ లాగా కోన వెంకట్ పేరు మీద వస్తున్న సినిమాలు వాష్ అవుట్ అవుతుంటే పాపం ఎలా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడగలుగుతారు. అందుకే గత కొన్నాళ్ళుగా తెరచాటున నిలబడి సినిమా చూస్తున్న కోన గారికి ఇప్పుడు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే బాలకృష్ణ డిక్టేటర్ సినిమా షూటింగ్ ముగియడంతో గుమ్మడికాయ కొట్టి, కొవ్వొత్తులు ఆర్పేసి, కేక్ కట్ చేసి పండగ చేసుకున్నారు. బాలయ్య బాబుతో పాటు దర్శకుడు శ్రీవాస్, రచయితలు శ్రీధర్ సీపానా, గోపి మోహన్ అండ్ కోన వెంకట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మొన్నటి దాకా మాయమైన కోన గారిని మళ్ళీ ఇలా చూసిన జనాలు నిజంగానే డిక్టేటర్ పట్ల ఓ పాజిటివ్ దృక్పదాన్ని కనబరుస్తున్నారు. పండక్కి రానున్న ఈ చిత్రం గనక హిట్ అయితే మళ్ళీ కోన గారి హవా మొదలవచ్చు. టాలివుడ్ ఇండస్ట్రీని ఏలిన ఓ ట్రెండ్ సెట్టర్ కోన గారు మళ్ళీ స్టార్ హీరోలతో బడా ప్రాజెక్టులు చేయాలని కోరుకుందాం.