Advertisementt

బంగార్రాజును పంపింది యమ నాగబాబు!

Mon 04th Jan 2016 02:27 PM
soggade chinni nayana,nagarjuna  బంగార్రాజును పంపింది యమ నాగబాబు!
బంగార్రాజును పంపింది యమ నాగబాబు!
Advertisement
Ads by CJ

నాగార్జున చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయన చిత్రం ఎట్టకేలకు ఈ నెల 6వ తేదీన సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లనుంది. అంతే కాకుండా నాగ్ ప్రకారం 15వ తారీఖును రిలీజ్ డేటుగా కూడా లాక్ చేసేసారు. మొత్తం ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇక సెన్సార్ పనులు కూడా  అయిపోయాయంటే విడుదలకు ఎటువంటి అడ్డంకులూ ఉండబోవు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన నాగార్జున అదే ఊపులో సోగ్గాడే చిన్ని నాయనలో తాను చేస్తున్న బంగార్రాజు పాత్ర గురించి చెప్పే ఓ వీడియో బిట్టుని కూడా వదిలారు. బంగార్రాజు అనే పాత్ర ఓ చనిపోయిన ఆత్మ అన్న విషయం ఇంతకుమునుపే చెప్పారు. కానీ యమలోకంలో జరిగే సంభాషణ ఇక్కడ ముఖ్యం. యముడి పాత్రలో నాగబాబు కనిపించబోతున్నారు. లక్షల ఏళ్ళ తరువాత ఓ ఆత్మను భూలోకం మీదకు పంపడంలో ఏదో లోక కళ్యాణం దాగి ఉన్నదన్న అర్థం వచ్చేలా ఈ వీడియో బిట్టు ఉంది. కథపరంగా బంగార్రాజు ఆత్మ కేవలం హీరోయిన్ రమ్యకృష్ణకు మాత్రమే కనపడుతుంది కాబట్టి కామెడీ అంతా అక్కడే కేంద్రీకృతం అయి ఉంటుంది. సోగ్గాడి ఆత్మ చేసే గమ్మత్తులు ఏంటో తెలియాలంటే 15 వరకు వెయిట్ చేయండి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ