Advertisementt

ఎంతైనా లారెన్స్‌ కేక..!

Mon 04th Jan 2016 12:00 PM
raghava lawrence,bhairava movie,horror comedy movie  ఎంతైనా లారెన్స్‌ కేక..!
ఎంతైనా లారెన్స్‌ కేక..!
Advertisement
Ads by CJ

ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న లారెన్స్‌ కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, డైరెక్టర్‌గా, సంగీత దర్శకునిగా.. తనదైన శైలిలో కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఆయన నటించి, డైరెక్షన్‌ చేసిన 'ముని, కాంచన, గంగ' ఇలా పలు చిత్రాలు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాడు. తాజాగా ఆయన చడీ చప్పుడు లేకుండా మరో సినిమా పూర్తి చేశాడు. అదే 'భైరవ'. ఈ చిత్రంలో లారెన్స్‌ పలు విభిన్న గెటప్‌లలో కనిపించి అలరించనున్నాడు. ఆయన గతంలో తీసిన హర్రర్‌ కామెడీ చిత్రాలను చూసిన ప్రేక్షకులు ఓ వైపు ఆయన చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, టాలీవుడ్‌ నిర్మాతలు ఈ చిత్రం అనువాద హక్కుల కోసం పోటీపడుతున్నారు. దానికి తగ్గట్లే ఆడియన్స్‌కు కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయని తెలుసుకొని,మొదటి నుండే అనవసర హైప్‌ క్రియేట్‌ కాకుండా ఉండటానికే రహస్యంగా సినిమా మొత్తం పూర్తి చేసి ఇప్పుడు ఈ విషయాన్ని తెలియజేశాడు. మరి ఈ చిత్రం మరెన్ని సంచలనాలను సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ