Advertisementt

అక్షయ్‌కు షాకిచ్చిన శంకర్‌..!

Mon 04th Jan 2016 11:48 AM
akshay kumar,shankar,rajinikanth,robo2 movie  అక్షయ్‌కు షాకిచ్చిన శంకర్‌..!
అక్షయ్‌కు షాకిచ్చిన శంకర్‌..!
Advertisement
Ads by CJ

శంకర్‌ సినిమా అంటే ఇక అది రజనీకాంత్‌ అయినా, కమల్‌హాసన్‌ అయినా, విక్రమ్‌ అయినా, లేక అమీజాక్సన్‌ అయినా ఒక్కటే. అయితే పైకి చూడటానికి సౌమ్యంగా కనిపించినా ఆయనలో ఓ డిక్టేటర్‌ దాగివున్నాడు. పాపం.. ఆయన తీస్తున్న 'రోబో2.0' చిత్రంలో నెగటివ్‌ పాత్రను చేయడానికి ఒప్పుకున్న బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌కు శంకర్‌ షాకిచ్చాడు. వాస్తవానికి బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ స్టైలే వేరు. తెలుగులో రవితేజలాగా ఆయన బాలీవుడ్‌లో ఏడాదికి ఈజీగా మూడు నాలుగు సినిమాలు చేస్తేస్తూ ఉంటాడు. కానీ పాపం.. ఆయన 'రోబో2.0'లో చేయడానికి ఒప్పుకొన్న తర్వాత శంకర్‌ ఆయన్ను చెన్నై పిలిపించి రెండు నెలలు లాక్‌ చేసేశాడు. ఈ చిత్రం కోసం సరికొత్త శిక్షణ తీసుకోవాలని, బరువు పెరగాలని, ఇంకా కండలు పెంచాలని, యాక్షన్‌ సీన్స్‌లో డూప్‌ లేకుండా ఎంత రిస్కీ షాట్‌ అయినా స్వయంగా చేయాలని చెప్పి, చెన్నైలోనే ఆయనకు ఓ విదేశీ కోచ్‌ను ఏర్పాటు చేసి షాకిచ్చాడు. వాస్తవానికి డిసెంబర్‌ 17 నుండి ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం చెన్నైలో వేసిన ఓ ప్రత్యేక సెట్‌లో రజనీకాంత్‌పై కొన్ని కీలకసన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు శంకర్‌. మరోవైపు ఫిబ్రవరిలో నుండి ఈ షూటింగ్‌లో అక్షయ్‌కుమార్‌ పాల్గొనాల్సి వుంది. కానీ అక్షయ్‌ను ముందుగానే చెన్నై పిలిపించి రెండు నెలల పాటు శిక్షణ తీసుకోవాలంటూ హుకుం జారీ చేశాడు. దీంతో అక్షయ్‌ పరిస్థితి అయోమయంలో పడింది. ఈ టైమ్‌లో ఆయన ఈజీగా బాలీవుడ్‌లో ఒక సినిమా పూర్తి చేసేవాడు. కానీ 'రోబో2.0'లో నటించడానికి ఒప్పుకోవడంతో ఇప్పుడు అక్షయ్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ