ప్రేక్షకులను, అభిమానులనే కాదు... దర్శకనిర్మాతలను, స్టార్ హీరోలను కూడా మాయ చేయడం తమిళ పొన్ను సమంతకు వెన్నతో పెట్టిన విద్య. ఆమె ఆన్‌ది స్క్రీన్ మాత్రమే కాదు... ఆఫ్ ది స్క్రీన్‌లో కూడా మాయచేస్తుంది. రీల్ లైఫ్‌లోనే కాదు.. రీయల్ లైఫ్‌లో కూడా హీరోలను మార్చినట్లు తన మాటలను మార్చేస్తుంది. సిద్దార్ద్‌తో ఆమె ప్రేమాయణం నడిపిన సమయంలో ఆమె ... ప్రేమ అంటే అది మధురమైన అనుభూతి. ప్రేమించని వారు, ప్రేమలో పడని వారు నా దృష్టిలో మూర్ఖులు. ప్రేమించే వారికే దాని మహిమ ఏమిటో తెలుస్తుంది.. అంటూ చెప్పేది. కానీ సిద్దార్ధ్‌తో కటీఫ్ అయిన తర్వాత మాత్రం ఆమె ప్రేమపై తన అభిప్రాయాన్ని మార్చుకొంది. కటీఫ్ అయిన సమయంలో ఆమెకు, సిద్దార్ద్‌కు మధ్య ట్వీట్ల యుద్దం జరిగి, కోల్డ్‌వార్ నడిచిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి సిద్దార్ధ్‌ను ఉద్దేశించి... ప్రేమంటే అది ఒక బూటకం. ఆకర్షణకే ప్రేమ అనే రంగు పులుముతారు. అదే ప్రేమ అని భ్రమిస్తుంటారు. నా దృష్టిలో ప్రేమ అనేది ఓ నాటకం. ముఖ్యంగా మగవారి ప్రేమను అసలు నమ్మకూడదు.. అంటూ ఇన్‌డైరెక్ట్‌గా సిద్దార్ద్‌నే మనసులో పెట్టుకొని నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆమె ప్రేమపై వెల్లడించిన అభిప్రాయాలే పెద్ద హాట్‌టాపిక్‌గా మారాయి. మొత్తానికి సమయానుకూలంగా మాటలు, అభిప్రాయాలను మార్చడంలో సమంతకు ఎవ్వరూ సాటిరారు.. అంటున్నారు కోలీవుడ్ జనం.