త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హీరోగా వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయడమే కాదు... పలు విషయాలలో ఈ సినిమా ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. అంతకు ముందు వరకు స్టార్ హీరోల సినిమాలు అంటే పవర్‌ఫుల్ టైటిల్స్ ఖచ్చితంగా ఉండాలనే రూల్స్‌ను బ్రేక్ చేసింది. అందరిలో ఆసక్తిని కలుగజేసే విధంగానే కాదు... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా కూడా టైటిల్స్‌ను పెట్టి అందరిలో క్యూరియాసిటీని రేకెత్తించే టైటిల్స్‌ను పెట్టవచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది. దీంతో మిగిలిన హీరోలు,దర్శకనిర్మాతలు కూడా అదే స్టైల్‌లో తమ చిత్రాలకు టైటిల్స్‌ను కన్‌ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో' అని, మహేష్‌బాబు నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' అని.. ఇటీవలే విడుదలైన రామ్ 'నేను.. శైలజ' వరకు అందరు హీరోలు ఇదే బాటలో నడుస్తున్నారు. అంతేకాదు... 'అత్తారింటికి దారేది' చిత్రం మరో రకంగా కూడా నేటి కుర్రహీరోలకు కొత్త దారి చూపించింది. అంతకు ముందు వరకు కేవలం భారీ ఫైట్లు, ఛేజింగ్‌లులతో, హోరాహోరి పోరాటాలను కాదని, స్టార్ హీరోల చిత్రాలను కూడా సాఫ్ట్‌గా, ఎమోషనల్‌గా నడిపించి విజయం సాధించవచ్చు అనే విషయాన్ని ఈ చిత్రం నిరూపించింది. కాగా ఇప్పుడు అదే దారిలో కొత్త దర్శకులు, హీరోలు కూడా తమ సినిమాలను కామెడీతో లేదా ఎమోషనల్ సీన్స్‌తో ముగిస్తున్నారు. తాజాగా వచ్చిన 'నేను.. శైలజ' చిత్రానికి ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఎంతో ప్లస్ అయ్యాయి. ఇక 'పిల్లా నువ్వులేని జీవితం'తో పాటు పలు చిత్రాలు ఇదే తరహాలో ముగింపులను ఇస్తున్నాయి. మరి ఈ క్రెడిట్ ఖచ్చితంగా త్రివిక్రమ్‌కే దక్కుతుందని, ఆయనే తెలుగు సినిమాల క్లైమాక్స్‌లను సరికొత్తగా ముగించే ప్రక్రియకు నాంది పలికాడని చెప్పవచ్చు.