Advertisementt

బ్రహ్మోత్సవానికి కథ లేదా?

Sun 03rd Jan 2016 04:33 PM
brahmotsavam story,mahesh babu,srikanth addala  బ్రహ్మోత్సవానికి కథ లేదా?
బ్రహ్మోత్సవానికి కథ లేదా?
Advertisement
Ads by CJ

బంధువులంతా ఒక్క చోట చేరితే కృష్ణ వంశీ సినిమా అవుతుందే గానీ సూపర్ హిట్ సినిమా కావాలంటే దానికి తగ్గట్టుగా కథా, కథనాలు ఉండాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఓ మోస్తరు హిట్టుగానే నిలబడింది గానీ ఇండస్ట్రీని షేక్ చేసే స్థాయి దాకా ఎందుకు వెళ్లలేదంటే అందుకు కారణం స్పష్టంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పాలనుకున్న కథనంలో బలంగా గుచ్చుకునే కథావస్తువు లేకపోవడమే. అటు తరువాత శ్రీకాంత్ తీసిన ముకుందా కూడా ఇదే లోపంతో బాధపడింది, భయపెట్టింది. ఇప్పుడు శ్రీకాంత్ గారికి మహేష్ బాబుతో మరోసాటి వంతు రానే వచ్చింది. అదే బ్రహ్మోత్సవం. విపరీతమైన క్యాస్టింగ్, అమోఘమైన ప్రొడక్షన్ స్టాండర్డ్స్ మీద రాబోతున్న ఈ చిత్రానికి కూడా శ్రీకాంత్ అడ్డాల ఎంచుకున్న కథలో పటిష్టమైన అంశం లేదంటూ పుకార్లు మొదలయ్యాయి. అందుకే కొన్ని రోజుల పాటు మహేష్ బాబు, నిర్మాత ప్రసాద్ పొట్లూరి షూటింగ్ కార్యక్రమాలకు బ్రేక్ చెప్పి పటిష్టమైన పాయింట్ పైకి తేలేలా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారట. శ్రీకాంత్ దగ్గర మహేష్ బాబు బాగా ఇష్టపడే అంశం, తెలుగు నేటివిటీకి దగ్గరగా మన సంప్రదాయాలు, కుటుంబ విలువలను అవలీలగా చెప్పగలగడమే. మరి అటువంటి ఈజ్ ఉన్న శ్రీకాంత్ కాసింత జాగ్రత్తగా కథను కూడా నమ్ముకుంటే సూపర్ హిట్లు పడడం పెద్ద కష్టం కానేకాదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ