Advertisementt

అంతా ట్రైలర్ మహిమే!

Sun 03rd Jan 2016 04:17 PM
nenu shailaja,overseas collections  అంతా ట్రైలర్ మహిమే!
అంతా ట్రైలర్ మహిమే!
Advertisement
Ads by CJ

ఓ సినిమా హిట్ కావాలన్నా, ఫ్లాప్ కావాలన్న ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో మరోసారి నేను శైలజ నిరూపించింది. నిజానికి రామ్‌ హీరోగా వచ్చిన గత చిత్రం శివమ్‌ తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే నేను శైలజ పట్ల కూడా చాలా వరకు పెద్దగా అంచనాలు నెలకొనలేదు. కానీ ఎప్పుడయితే ట్రైలర్ విడుదలయిందో ఒకేసారి ఇది డిఫరెంట్ చిత్రం అనే దృడనిశ్చయానికి వచ్చేసారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు రామ్ కెరీర్లోనే ఈ చిత్రం అతిపెద్ద హిట్‌ దిశగా దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా రిలీజ్ డే రోజున వచ్చిన వసూళ్లు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం ట్రైలర్ రేపిన ఆసక్తి మాత్రమే ఇంతటి పాజిటివ్ కలెక్షన్లకు దారి తీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. థియేటర్ వరకు రప్పించడానికే ట్రైలర్ ఉపయోగపడింది. మరి అక్కడి నుండి రామ్, కిషోర్ తిరుమల, కీర్తి సురేష్, సత్యరాజ్ అందరూ కలిసి వీక్షకులని ఎమోషనల్ రైడ్ మీద తీసుకువెళ్ళారు గనకనే ఇంతటి విజయం. అమెరికాలో ప్రీమియర్ షో అండ్ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర నేను శైలజ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. నానీ భలే భలే మగాడివోయ్ తరువాత రామ్ నేను శైలజనే మిలియన్ డాలర్ క్లబ్బు దరిదాపుల్లోకి చేరే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణల సారాంశం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ