మనకున్న కుర్ర స్టార్ హీరోల్లో ప్రభాస్, గోపీచంద్ లాంటి వాళ్ళని మినహాయిస్తే మిగిలిన మెగా, నందమూరి, అక్కినేని క్యాంపు హీరోలంతా ఎత్తులో పొట్టివారే. బాలివుడ్ లాగా ఆరడుగులు ఉంటే గానీ స్టార్ డం అంటగట్టం అనే భావన మన దగ్గర ఎప్పటి నుండో లేదు. అందుకే అయిదు అయిదు, అయిదు ఆరు నుండి అయిదు ఎనిమిది ఫీట్ల వరకున్నా మనాళ్ళు ఆరడుగుల బుల్లెట్టు అని పాట రాసేసుకుంటారు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో సినిమా కోసం జూనియర్ ఎన్టీయార్ మీద సంక్రాంతికి విడుదల అంటూ ప్రమోషన్ ప్రకారం విడుదల చేసిన ఓ పోస్టర్ మీద గమ్మత్తయిన కామెంట్లు వినపడుతున్నాయి. అసలే ఎన్టీయోరు హైట్ తక్కువ. మరి అంత స్టైలిష్ గెటప్ వేసుకుని మళ్ళీ ఆ చేతులో అరికాళ్ళ నుండి నడుం దాకా అంత పొడుగు సూట్ కేస్ పట్టుకుని నడుస్తుంటే సూట్ కేస్ పెద్దదయిందా లేక ఎన్టీయార్ ఎత్తు పొట్టిగయిందా అనే సందేహం కలుగుతోందట కొంతమంది ప్రేక్షకులకి. నిజమే మరి, సంక్రాంతికి వస్తున్నాడంటే ఇంకేదైనా పోజులో చూపించాలి గానీ ఇలా సూట్ కేసు పట్టుకుని బస్సులో తిరుగు ప్రయాణానికి బయల్దేరిన ప్యాసెంజరులా కనపడుతుంటే ధియేటర్లలో ఉండడానికి వస్తున్నాడా లేకా చుట్టం చూపుగా ఇలా వచ్చి అలా వెల్లిపోతున్నాడా అనే ఒపీనియన్ కలుగుతోందని బాణాలు సంధిస్తున్నారు యాంటీలు. ఆ ప్రాపర్టీ మార్చండయ్యా.... మార్చండీ!