Advertisementt

తమన్నా నీకు అవసరమా..!

Sun 03rd Jan 2016 11:52 AM
thamanna,ghost role,lady oriented movie,aandal ramesh  తమన్నా నీకు అవసరమా..!
తమన్నా నీకు అవసరమా..!
Advertisement
Ads by CJ

ఈమధ్యనే 'బాహుబలి'లో తన అందంతో అందరి మతులు పొగొట్టిన తమన్నా త్వరలో ఓ హర్రర్‌ చిత్రం కమిటవ్వబోతోందని చెన్నై వర్గాల టాక్‌. అంతేకాకుండా ఆమె పాత్ర దెయ్యం అని తెలుస్తోంది. ఆమె గతంలో రామ్‌ హీరోగా వచ్చిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రంలో ఆత్మగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫ్లాప్‌ అయింది. దాంతో ఆమె మరోసారి దెయ్యంగా కనిపించనుందంటే ఆమె అభిమానులు కంగారుపడుతున్నారు. ఇప్పుడు హీరోయిన్‌ ఓరియంటెడ్‌ దెయ్యాల సీజన్‌ జోరుగా నడుస్తోంది. ఇప్పటికే త్రిష, నయనతార, హన్సికల నుండి రాయ్‌లక్ష్మీ, లక్ష్మీమీనన్‌ వరకు హర్రర్‌ చిత్రాల్లో నటించేశారు. అదే కోవలో తమన్నా కూడా దెయ్యంగా కనిపించబోతోందని తెలుస్తోంది. ఆండాళ్‌ రమేష్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నాడు. ఇది హర్రర్‌ కథా చిత్రం అయినా ఇప్పటివరకు ఎవ్వరూ చూడని కథ అంటున్నాడు. ముఖ్యంగా ఈ కొత్త చిత్రంలో దెయ్యమే హీరో అని డైరెక్టర్‌ చెబుతున్నాడు. హీరోయిన్‌ ప్రాముఖ్యత ఉంటుందని, ఆ పాత్రను తమన్నా అయితేనే బాగుంటుంది కాబట్టి ఆమెను తమ చిత్రంలోకి తీసుకోనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ