Advertisementt

పొంగల్‌కి బన్నీ గిఫ్ట్‌..!

Sat 02nd Jan 2016 10:30 PM
allu arjun,boyapati srinu,sarainodu movie,sankranthi special gift,first look  పొంగల్‌కి బన్నీ గిఫ్ట్‌..!
పొంగల్‌కి బన్నీ గిఫ్ట్‌..!
Advertisement
Ads by CJ

అల్లుఅర్జున్‌ హీరోగా బోయపాటిశ్రీను దర్శకత్వంలో 'సరైనోడు'(వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. పవర్‌ఫుల్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేసి సంక్రాంతి కానుకగా ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇలా చేస్తే ఫ్యాన్స్‌కు పండగ ట్రీట్‌ ఇచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారు. కాగా గీతాఆర్ట్స్‌ బేనర్‌లో అల్లుఅరవింద్‌ నిర్మిస్తున్న చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అల్లుఅర్జున్‌ జన్మదినోత్సవ కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌8వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రకుల్‌ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ