Advertisementt

పవన్ సినిమా కోసం రేణుతో మంతనాలు!

Sat 02nd Jan 2016 06:47 PM
renu desai,pawan kalyan,sj suryah  పవన్ సినిమా కోసం రేణుతో మంతనాలు!
పవన్ సినిమా కోసం రేణుతో మంతనాలు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్, రేణు దేశాయి వివాహ బంధానికి సంబంధించి విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు సాఫీగా నడుపుకుంటున్నా, ఇద్దరినీ కలిపినా సినిమా పట్ల మాత్రం వారి ఇరువురి ప్యాషన్, కమ్యునికేషన్ అలాగే ఉంది. ఇటు పవన్ సినిమాలు, రాజకీయాలు అంటూ బిజీబిజీగా ఉంటుంటే అటు రేణు కూడా మరాఠిలో ఈ మధ్యే ఓ సినిమా చేసింది. ఇలా చిత్ర పరిశ్రమతో పాటుగా వీరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ అందరితోను సఖ్యత సైతం అలాగే కంటిన్యూ అవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా ఖుషీ, కొమరం పులిలాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన SJ సూర్య మరోసారి ఓ తెలుగు ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం పవన్ నుండి కూడా అంగీకారం పొందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను రేణు దేశాయ్ నిర్మించే అవకాశం కూడా ఉందన్న వార్త నిన్నే తెలిసింది. ఈ విషయమై చర్చించడానికి SJ సూర్య స్వయంగా రేణుతో మంతనాలు జరిపినట్టు కూడా కొన్ని మాధ్యమాల ద్వారా ప్రచారమవుతోంది. అందులో భాగంగానే న్యూ ఇయర్ వేడుక రోజున అంటే నిన్న రేణు, SJ సూర్యలు కలిసి లంచ్ చేస్తూ దిగిన ఫోటో ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. మరి రేణుకు అన్నీ ఓకే అయితే పవన్ డేట్స్ ఇవ్వడమే తరువాయి కావొచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ