Advertisementt

రాముడు ఎంత మంచి బాలుడో!

Sat 02nd Jan 2016 04:09 PM
ram,nenu shailaja,kishore tirumala  రాముడు ఎంత మంచి బాలుడో!
రాముడు ఎంత మంచి బాలుడో!
Advertisement
Ads by CJ

ఎప్పుడూ చిచ్చుబుడ్డిలా పేలే కుర్ర హీరో రామ్ మరీసారి సౌండ్ లేకుండా హిట్ కొట్టేసేలా ఉన్నాడు. ఎనలేని ఎనర్జీని పొంతన లేని క్యారెక్టర్లో, అవసరం లేని చోటల్లా వృదాగా ఖర్చు చేసే రామ్ ఈసారి మాత్రం  నేను శైలజ అంటూ సెటిల్ పర్ఫార్మెన్స్ చేసి వీక్షకులను ఇట్టే కట్టిపడేసాడు. నిన్న రిలీజయిన కిషోర్  తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి సర్వత్ర పాజిటివ్ టాక్ వచ్చేసింది. సినిమాలో సంభాషణలు, కథనం కొత్తగా ఉందని పేరొచ్చినా మరీ ముఖ్యంగా కథానాయకుడిగా రామ్ చూపించిన పరిపక్వతకే   ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇంతటి మెచ్యూర్ నటన ఆయన నుండి ఎవరూ ఊహించి ఉండరు. కుర్రకారు అభిరుచులని సరిగ్గా ఒడిసి పట్టుకుంటే మామూలు సినిమా అయినా సూపర్బ్ వసూళ్లు రాబడుతున్న ఈ రోజుల్లో మరి నిజంగా ఓ సూపర్బ్ సినిమానే పడితే ఎంత బాగుంటుంది అనేదానికి నిర్వచనం నేను శైలజ. అందుకేనేమో యూత్ మొత్తం ఇప్పుడు రాముడు మంచి బాలుడు అంటూ నేను శైలజకు క్యూ కడుతున్నారు. ముందు నుండీ సినిమా గురించి రామ్ చెబుతున్న మాటలన్నీ నేడు నిజమయ్యాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ