Advertisementt

ఫిబ్రవరిలో కూడా మంచి పోటీ..!

Sat 02nd Jan 2016 11:52 AM
a aa movie,sahasam swasaga sagipo,speedunnodu,jai balayya  ఫిబ్రవరిలో కూడా మంచి పోటీ..!
ఫిబ్రవరిలో కూడా మంచి పోటీ..!
Advertisement
Ads by CJ

జనవరి 1వ తేదీ తర్వాత సంక్రాంతి సీజన్‌లో భారీ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. అయితే ఈ సినిమాల కోలాహలం ఫిబ్రవరిలో కూడా కొనసాగనుంది. ఫిబ్రవరి 5వ తేదీన నాని హీరోగా 14రీల్స్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'జై బాలయ్య' చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా సమంత, అనుపమ పరమేశ్వరన్‌లు కలిసి నటిస్తున్న 'అ..ఆ' చిత్రం కూడా ఫిబ్రవరిలోనే విడుదలకు ముస్తాబు అవుతోంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తమిళ 'సుందరపాండ్యన్‌'కు రీమేక్‌గా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పీడున్నోడు' చిత్రం, నాగచైతన్య హీరోగా గౌతమ్‌మీనన్‌ల దర్శకత్వంలో రూపొంందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం.. ఇలా మరికొన్ని చిత్రాలు కూడా ఫిబ్రవరిలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. సో.. ఈ ఏడాది కూడా సినిమా సీజన్‌ కేవలం సంక్రాంతికే ముగియడం లేదు. ఫిబ్రవరి నెలలో కూడా సినిమా జాతర జరుగనుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ