Advertisementt

స్పూఫ్ ల వీరుడు ఇతనే..!

Fri 01st Jan 2016 07:16 PM
artist prudhvi,spoofs,bahubali,sreemanthudu,gabbarsingh  స్పూఫ్ ల వీరుడు ఇతనే..!
స్పూఫ్ ల వీరుడు ఇతనే..!
Advertisement
Ads by CJ

హిట్‌ సినిమాలకు స్పూఫ్ ల చేయడం కామన్‌. ఆ మధ్యకాలంలో మాత్రం స్పూఫ్ లు పెద్దగా కనపించలేదు. మరలా తాజాగా ఈ ట్రెండ్‌ మళ్లీ వచ్చింది. సూపర్‌హిట్‌ చిత్రాలైన 'బాహుబలి, శ్రీమంతుడు, గబ్బర్‌సింగ్‌' చిత్రాలకు స్పూఫ్ లుగా వచ్చినవి అందరినీ బాగా అలరిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా మూడు చిత్రాల్లో ఈ స్పూఫ్ లేే ప్రధానపాత్ర పోషించాయి. ప్రభాస్‌ 'బాహుబలి' సినిమాకు దాదాపు నాలుగు సినిమాలలో స్పూఫ్ లు చేయగా, 'శ్రీమంతుడు' కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఏమిటంటే... ఈ సినిమాల స్పూఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం 30ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీనే కావడం విశేషం. 'బాహుబలి'లో శివలింగాన్ని ఎత్తిన సీన్‌ను అనుకరించడంలో తనకు సాటి ఎవ్వరూ లేరని నిరూపించిన పృథ్వీ 'భలే మంచి రోజు' సినిమాలో కూడా పోలీస్‌ పాత్రల్లో డైలాగులు వరుసబెట్టి చెప్పాడు. మహేష్‌ 'శ్రీమంతుడు' సినిమాలో డైలాగ్స్‌ అచ్చంగా దించి ఆడియన్స్‌ చేత ఈలలు వేయించాడు. 'శంకరాభరణం' సినిమాలో కూడా 'శ్రీమంతుడు' డైలాగ్‌ చెప్పి విజిల్స్‌ వేయించాడు. ఇలా పృథ్వీ విజృంభణ చూస్తే అతన్ని 'స్పూఫ్'ల వీరుడుగా పేర్కొనవచ్చు.