Advertisementt

శంకర్ టార్గెట్ రజినీ కాదు..!

Fri 01st Jan 2016 04:54 PM
akshay kumar,robo 2,rajinikanth,shankar,amy jackson  శంకర్ టార్గెట్ రజినీ కాదు..!
శంకర్ టార్గెట్ రజినీ కాదు..!
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రోబో 2.0' చిత్రంలో నెగటివ్‌ రోల్‌ చేస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ఇప్పుడు తన బరువును పెంచే పనిలో పడినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అతను స్పెషల్‌ ఫిట్‌నెస్‌ క్లాసులకు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ పాత్రకు అర్నాల్డ్‌ను అనుకొన్నారు. అయితే రెమ్యూనరేషన్‌ వంటి కొన్ని కారణాలతో అది మెటీరియలైజ్‌ కాలేదు. అలాగే ఈ సినిమా కోసం అక్షయ్‌ ఓ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంటున్నాడు. అందుకోసం ఆయన చెన్నై వచ్చిపోతున్నాడని బాలీవుడ్‌ టాక్‌. డిసెంబర్‌ 16నుంచి ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో రజనీ పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రజనీ సరసన ఇందులో అమీజాక్సన్‌ నటిస్తోంది. ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గ్రాఫిక్స్‌ వర్క్‌కు చాలా సమయం తీసుకోనుందని, అందువల్ల 2017 సమ్మర్‌లోగానీ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ