నిర్మాత దిల్ రాజు పూర్తిగా ఓ ఫార్ములా మనిషి. ఈయన సినిమాలలో ఎక్కువ శాతం విజయాలు ఎందుకు సాధిస్తాయంటే ఓ పద్ధతి, ప్లానింగ్ ప్రకారం ఈయన సినిమాను కంపోజ్ చేస్తాడు కాబట్టి. కొద్ది సార్లు ఆ కంపోజిషన్ తేడా కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. సునీల్ హీరోగా వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న కృష్ణాష్టమికి ఇంకా పున్నమి రావడం లేదు. నిజానికి జనవరీ మొదటి వారంలోనే సంక్రాంతి బడా చిత్రాలు రాకముందే కృష్ణాష్టమిని రిలీజు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు దిల్ రాజు. ఆఖరి క్షణం వరకు ఆ ఆలోచనతోనే పని చేసినా, క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ దృశ్యాలు దిల్ రాజును పూర్తిగా నిరాశపరిచాయట. సునీల్ అంటే బేసిగ్గా కామెడీ ఎక్కువుండాలి, కానీ సినిమా మొత్తం సునీల్ సీరియస్ మొహం వేసుకొని ఉండడం దిల్ రాజుకు నచ్చటం లేదంట. పైగా క్లైమాక్స్ మరీ ఓవర్ అయినట్టు అనిపించి మరింత డ్రామా, కామెడీ కోసం కొన్ని సీన్లు రీ-షూటు చేయమని ఆదేశించాడట. ఇక అన్నీ పూర్తయి మళ్ళీ దిల్ రాజు ముందు షో వేసేవరకు విడుదల తారీఖు ఊసే ఉండదు. సునీల్ ఒక్కడే కాదు దర్శకుడు వాసు వర్మ, నిర్మాత దిల్ రాజు కూడా కృష్ణాష్టమి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.