చిరంజీవి నూట యాభయ్యో సినిమా నుండి నితిన్, వరుణ్ తేజలతో దోబూచులాడిన లోఫర్ కథ వరకు, ఆమె సొంతంగా నటించి నిర్మించుకున్న జ్యోతిలక్ష్మి వరకు పూరీ జగన్నాథ్ చేయి పెట్టిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి తనదే ఫైనల్ డెసిషన్ మేకింగ్ అనే రెంజులో కలరింగ్ ఇచ్చిన ఛార్మీ ఇప్పుడు నోరు మెదపకుండా గమ్మున ఉండి పోయింది? సగంలో ఆగిపోయిన రోగ్ సినిమాకు సంబంధించి కూడా ఛార్మీ ఓవర్ యాక్షన్ చేస్తోందని తెలుస్కున్న పూరీ ఆమెను ఒకేసారి తన కాంపౌండ్ నుండి గెంటి వేయడం టాలివుడ్ అంతటా చర్చనీయాంశం మారింది. పూరీకు టచ్ ఉన్నంతవరకూ అన్నింటా తానై ఉండాలనుకున్న ఛార్మీకి ఇంతటి అవమానమా అని సినీజనాలు కూడా కామెంట్స్ వదులుతున్నారు. ఇప్పటి దాకా జరిగిన దాంట్లో నిజం ఎంతో, కల్పితం ఎంతో మనకు తెలీదు గానీ... పూరీ ఆఫీసు నుండి ఛార్మీ గెట్ అవుట్ అయిపోయిన మాట అబద్ధం అయితే అమ్మడు ఈ పాటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ తన మీద వస్తున్న గాసిప్పులకు కప్పు కాఫీ ఇచ్చి మరీ సంజాయిషీ ఇచ్చుకునేది. దీనికి పూర్తి భిన్నంగా ఛార్మీ సైలెంట్ అయిపోయిందంటే జరిగిన దాంట్లో నిజం పాళ్ళే ఎక్కువన్నట్లు కదా! ఛార్మీ తప్పు ఒప్పుకున్నట్లే కదా!