Advertisementt

పవన్ లిస్టులోకి మరో కొత్త దర్శకుడు!

Thu 31st Dec 2015 02:03 PM
pawan kalyan,jhony master,choreographer,dasari narayanarao  పవన్ లిస్టులోకి మరో కొత్త దర్శకుడు!
పవన్ లిస్టులోకి మరో కొత్త దర్శకుడు!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయాలని అందరి టెక్నీషియన్స్‌కు కోరికే. అయితే అది కొందరికే నెరవేరుతుంది. అలాగే కొరియోగ్రాఫర్‌ జాని మాస్టర్‌కు కూడా పవన్‌ని డైరెక్ట్‌ చేయాలని కోరిక. త్వరలో అది నిజం కాబోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్‌ రీసెంట్‌గా పవన్‌కు ఓ కథ వినిపించాడు. కథ నచ్చడంతో పవన్‌ ఎవరినైనా ప్రొడ్యూసర్‌ని కలవమని చెప్పాడని సమాచారం. దాంతో ఈ సినిమా కోసం జానీ మాస్టర్‌ దాసరి నారాయణరావును కలిసి కథ చెప్పాడని, ఆయన నిర్మించే అవకాశాలు కనపడుతున్నాయని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 'రేసుగుర్రం, జులాయి, రచ్చ, ఎవడు' వంటి పెద్ద పెద్ద సినిమాలకు జానీ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసి విజయం సాధించాడు. ఇప్పుడు పవన్‌ని డైరెక్ట్‌ చేసే లెవల్‌కు వెళ్లబోతున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే త్వరలోనే జానీ మాస్టర్‌ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్‌ నటించే అవకాశాలు పుష్కళంగా కనిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ