Advertisementt

సురేందర్‌రెడ్డి వల్లే ఆలస్యం..!

Thu 31st Dec 2015 12:08 PM
surendar reddy,thani oruvan remake,ram charan  సురేందర్‌రెడ్డి వల్లే ఆలస్యం..!
సురేందర్‌రెడ్డి వల్లే ఆలస్యం..!
Advertisement
Ads by CJ

రామ్‌చరణ్‌ త్వరలో తమిళ చిత్రం 'తని ఒరువన్‌' రీమేక్‌లో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఈ చిత్రం జనవరి 16న ప్రారంభంకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభం మరింత ఆలస్యం కానుంది. అందుకు కారణం సురేందర్‌రెడ్డినే అని తెలుస్తోంది. రామ్‌చరణ్‌కి స్క్రిప్ట్‌ నేరేషన్‌ ఇవ్వాల్సిన సమయంలో దర్శకుడు సురేందర్‌రెడ్డి తన వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళ్లాడు. ఈ నెలాఖరుకు గానీ ఆయన హైదరాబాద్‌కు రాడు. దీంతో జనవరిలో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రం ఓ నెల వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరి 10న ఈ రీమేక్‌ను ప్రారంభించి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారని తాజా సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ