Advertisementt

వర్మ చుట్టేయలేదంట..?

Thu 31st Dec 2015 11:21 AM
killing veerappan movie,january 1st release,ram gopal varma  వర్మ చుట్టేయలేదంట..?
వర్మ చుట్టేయలేదంట..?
Advertisement
Ads by CJ

సినిమాలను తీయడం కంటే చుట్టేయడంపైనే దృష్టి పెట్టే వర్మ ఈమధ్య తన ఫ్యాన్స్‌ని బాగా నిరాశపరుస్తున్నాడు. వర్మ సినిమాలు ప్లాపుల మీద ఫ్లాపులు కొట్టేయడం... చీప్‌ట్రిక్స్‌తో తనకు పబ్లిసిటీ కల్పించుకోవడం ... ఇవ్వన్నీ చూసి బోర్‌ కొట్టేసింది ఆయన ఫ్యాన్స్‌కు. వర్మ వీరాభిమానులు కూడా ఇప్పుడాయన సినిమాలను లైట్‌గా తీసుకొంటున్నారు. అయితే... చాలాకాలం తర్వాత వర్మలోని దర్శకుడు 'కిల్లింగ్‌ వీరప్పన్‌'లో కనిపించనున్నాడని ల్యాబ్‌ రిపోర్ట్‌. ఈ సినిమా చాలా బాగా వచ్చిందట. వర్మ ఒళ్లు దగ్గరపెట్టుకొని మరీ ఈ సినిమాను తీశాడని, వర్మలోని టేకింగ్‌ పవర్‌ వీరప్పన్‌లో కనిపించనుందని టాక్‌. పైగా ఈ సినిమాను చుట్టేయడం కాకుండా క్వాలిటీతో తీశాడట వర్మ. వీరప్పన్‌ పోలీసులకు ఎలా దొరికాడన్న ఎపిసోడ్‌ని థ్రిల్లింగ్‌గా తీశాడట. ఆ ఎమోషన్స్‌ అన్నీ సినిమాలో బాగా క్యారీ అయ్యాయని తెలుస్తోంది. అందుకే వర్మ కూడా వీరప్పన్‌పై కాన్ఫిడెన్స్‌గా ఉన్నాడు. చూస్తుంటే వర్మ చాలాకాలం తర్వాత అద్బుతం చేసేటట్టే కనిపిస్తున్నాడు. జనవరి 1వ తేదీన ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ