జూనియర్ ఎన్టీయార్ అంటేనే సరైన కథ, క్యారెక్టర్ పడితే పెర్ఫార్మన్స్ పీక్ అని ముందే అనేసుకోవచ్చు.
మొన్న టెంపర్ ఒక్కటి చాలు, బుడ్డోడి నట విశ్వరూపం చూపాడు అని చెప్పుకోడానికి. ముఖ్యంగా ఎమోషన్లను పండించడంలో మనకున్న హీరోలందరిలో తారక్ స్టామినాయే వేరు. ఎన్నోసార్లు ఈ విషయం ప్రూవ్ అయినా, బాక్సాఫీసును డీకొట్టాలన్న ప్రతిసారీ మళ్ళీ సేమ్ టూ సేమ్ రీ-ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈసారి ఫాదర్ సెంటిమెంట్ మీద వస్తున్న నాన్నకు ప్రేమతో చిత్రంలో ఒక్క సీన్ చూస్తే చాలు టైగర్ నటస్వరూపం ఏంటో మరోసారి రుచి తెలుస్తుంది అంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు. తండ్రి రాజేంద్రప్రసాద్, కొడుకు ఎన్టీయార్ల మీద సుకుమార్ రాసిన ఈ దృశ్యం సినిమా సెకండ్ హాఫ్ మొత్తానికే హైలైట్ కానుందట. షాట్ తీస్తున్న సినిమాటోగ్రాపర్ విజయ్ చక్రవర్తి కూడా మనోడి నటన చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యారంటే రేపు థియేటర్లలో ప్రేక్షకులు కర్చీఫులు కర్చీఫులు తడుపుకోవాల్సిందేనేమో! అటు విలన్ జగపతిబాబుతో మైండ్ గేమ్, ఇటు తండ్రి రాజేంద్రప్రసాద్ గారితో హార్ట్ టచింగ్ ఎమోషనల్ థీమ్... అన్నీ కలగలిపి నాన్నకు ప్రేమతో ఒక పర్ఫెక్ట్ ఎన్టీయార్ సినిమా అవుతుందా?