Advertisementt

చిరంజీవి తర్వాత ప్రభాసే!

Wed 30th Dec 2015 04:19 PM
chiranjeevi,prabhas,prabhas rolls royce car,bahubali,young rebal star  చిరంజీవి తర్వాత ప్రభాసే!
చిరంజీవి తర్వాత ప్రభాసే!
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కొత్త లగ్జరీ కారు కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్లలో ఒకటైన రోల్స్‌రాయిస్‌ సిరీస్‌కి చెందిన ఫాంటమ్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ఖరీదు 8కోట్ల పైమాటే. ఈకారు ఇటీవలే ప్రభాస్‌కు డెలివరీ కూడా అయిందని సమాచారం. కొత్త కారు కొన్న సందర్భంగా ఆయన తన ఫ్రెండ్స్‌ అందరికీ తన ఫామ్‌హౌస్‌లో గ్రాండ్‌ పార్టీ ఇచ్చాడట. 'బాహుబలి' సినిమాకు ప్రభాస్‌ భారీగా రెమ్యూనరేషన్‌ అందుకున్నాడు. ఆ డబ్బుతోనే ఆయన ఈ కారు కొనుగోలు చేశాడట. టాలీవుడ్‌లో రోల్స్‌ రాయిస్‌ కారు ఇప్పటివరకు చిరంజీవి వద్ద మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆ కారు కొనుగోలు చేసింది ప్రభాస్‌ మాత్రమే అని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ