టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్. అప్పడప్పుడు వివాదాలు, విమర్శలతో వార్తల్లో ఉండే మెగా నిర్మాత. అలాంటి ఆయన ఈ మధ్యన సైలెంట్ అయ్యాడు. ఏ సినీ వేడుకలోనూ కనిపించలేదు. ఏమయ్యాడా అని ఆరాతీసిన వాళ్లకు షాకిచ్చాడు ఆ నిర్మాత. ఇంతకీ ఆయనెవరనుకుంటున్నారు. ఇంకెవరు? బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్.
మెగా వీరాభిమానిగా, బడా నిర్మాతగా చెప్పుకునే బండ్ల గణేష్ ఈ మధ్యన ఏ సినిమాలను ఒప్పుకుంది లేదు. ఆర్థికలావాదేవీల విషయంలో కోర్టులు, కేసులతో మొన్నా మధ్య వరకు మీడియాలో హైలెట్ అయిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎక్కడున్నాడు..అసలేం చేస్తున్నాడని ఆరాతీస్తే ఇలా కోళ్ల ఫారంలో గుడ్లు ఏరుకుంటూ కనిపించాడు బండ్ల.
నిర్మాతే కాదు బండ్లగణేష్ వ్యాపారవేత్తకూడా . ఆయనకు షాద్ నగర్ లో కోళ్ల ఫారమ్స్ ఉన్నాయంటారు. అక్కడే ఇలా కనిపించడంతో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు కొందరు. ఇప్పుడీ ఫోటో హాట్ ఆఫ్ ది పిక్ గా మారింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ అదేంటీ మెగా ఫ్యామిలీ….. ఈ వీరాభిమానిని పట్టించుకోవడం లేదా? ఇలా వదిలేస్తే ఎలా అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.