Advertisementt

నియంతృత్వ పాలనకి కేరాఫ్ అడ్రస్ ఇది!

Wed 30th Dec 2015 02:55 PM
tfpc,telugu cinema producer council,tfpc committee,scams,elections,telugu cinema,scam in telugu cinema producer council  నియంతృత్వ పాలనకి కేరాఫ్ అడ్రస్ ఇది!
నియంతృత్వ పాలనకి కేరాఫ్ అడ్రస్ ఇది!
Advertisement
Ads by CJ

నియంతృత్వ పాలనలో 'తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి'

28.12.2015 న జరిగిన Telugu Film Producers Council E.C Meeting లో, TFPCలో జరిగిన ‘స్కాం’ పైన ‘మీడియా మీట్’ నిర్వహించి, TFPC Committee ‘స్కాం’కి బాధ్యత వహించాలి అని మాట్లాడారు అనే కారణంతో జనరల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, TFPC సభ్యుడు సాయి వెంకట్, TFPC E.C Member రామకృష్ణగౌడ్ లకు ‘SUSPENSION SHOW CAUSE నోటీసు’ ఇద్డామని తీర్మానించటం అధర్మ, నియంతృత్వ, పరిపాలనకు పెద్ద స్కాం జరిగినా నైతిక బాధ్యత వహించి ప్రెసిడెంట్ బూరుగుపల్లి శివరామకృష్ణ రాజీనామా చెయ్యకుండా, సభ్యుల అభిప్రాయాలకు ఏ మాత్రం విలువనివ్వకుండా, ఏదో ఒక సాకుతో ఎన్నికలు జరిపించకుండా, అయిదేళ్లుగా ఇష్టరాజ్యంగా అనేక scamsతో, అన్యాయపు, దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ, TFPC Meetings లో జరిగినవి కానీ, మండలి విషయాలు కానీ ఎవ్వరూ బయట మీడియాకి తెలియచేయకూడదు అంటూ,  ఒక బూర్జువా పరిపాలన కొనసాగిస్తూ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చినందుకు ముగ్గురు సభ్యులను show cause notice ఇచ్చి సస్పెండ్ చెయ్యాలనే చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఈ అప్రజాస్వామ్య పరిపాలనకు అంతం పలకటానికి వెంటనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోమని దాసరి గారిని కోరుకుంటున్నాము.

- ‘తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి’ సభ్యులు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ