Advertisementt

టాలీవుడ్ లో పవన్, కోలీవుడ్ లో రజనీ!

Wed 30th Dec 2015 02:01 PM
pawan kalyan,rajini kanth,rajinikanth movies,vijay,mannan  టాలీవుడ్ లో పవన్, కోలీవుడ్ లో రజనీ!
టాలీవుడ్ లో పవన్, కోలీవుడ్ లో రజనీ!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాలో పవన్ ప్రస్తావన ఎలా వుంటుందో..తెలియంది కాదు. అయితే కోలీవుడ్ లో మాత్రం ఏకంగా రజిని సినిమాలనే వాడేస్తున్నారు. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అనే సామెతను రజనీని చూస్తే నిజమే అనిపిస్తుంది. ఆయన పాత చిత్రాలకు ఇప్పుడు భలే గిరాకి ఏర్పడుతోంది. రజనీ నటించిన పాత హిట్‌ చిత్రాలను ఇప్పుడు పలువురు దర్శకనిర్మాతలు రీమేక్‌లు చేస్తూ బాగా వాడేసుకుంటున్నారు. ఈ హవా కోలీవుడ్‌లో రోజురోజుకూ ఊపందుకుంటోంది. గతంలో రజనీ నటించిన 'బిల్లా, మాపిళ్లై' చిత్రాలను ఆల్‌రెడీ రీమేక్‌ చేసేశారు. 'బిల్లా'గా వచ్చిన అజిత్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టగా, 'మాపిళ్లై'గా వచ్చిన ధనుష్‌ చిత్రం ఫర్వాలేదనిపించుకొంది. వీటికి తోడు మరో రెండు రజనీ చిత్రాలను రీమేక్‌ చేయడానికి సిద్దమవుతున్నారు. 1992లో వచ్చి ఘనవిజయం సాధించిన 'పాండియన్‌' చిత్రాన్ని ఆర్యతో రీమేక్‌ చేయనున్నారు. ఇక తెలుగులో చిరంజీవి హీరోగా తమిళ 'మన్నన్‌'కు రీమేక్‌గా వచ్చిన 'ఘరానామొగుడు' చిత్రం తెలుగులో కూడా ఘనవిజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని విజయ్‌ హీరోగా రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాలు కనుక హిట్‌ అయితే భవిష్యత్తులో రజనీ నటించిన మరిన్ని చిత్రాలు రీమేక్‌ అయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ