Advertisementt

ఎన్టీఆర్‌,సుక్కులు సెంటిమెంట్‌ బ్రేక్ చేస్తారా!

Wed 30th Dec 2015 01:54 PM
jr ntr,sukumar,sankranthi sentiment,nannaku prematho,dictator,balayya,nagarjuna,soggade chinni nayana  ఎన్టీఆర్‌,సుక్కులు సెంటిమెంట్‌ బ్రేక్ చేస్తారా!
ఎన్టీఆర్‌,సుక్కులు సెంటిమెంట్‌ బ్రేక్ చేస్తారా!
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'నాన్నకు ప్రేమతో' చిత్రం ట్రైలర్‌కే కాదు.. ఆడియోకు కూడా మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఎన్టీఆర్‌, సుకుమార్‌లకు ఉన్న ఓ బ్యాడ్‌ సెంటిమెంట్‌ అందరినీ భయపెడుతోంది. సంక్రాంతి కానుకగా ఇప్పటివరకు ఎన్టీఆర్‌ కెరీర్‌లో 'నాగ, నా అల్లుడు, అదుర్స్‌' చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో కేవలం 'అదుర్స్‌' మాత్రమే హిట్‌ అయింది. అది కూడా కేవలం హిట్టే కానీ బ్లాక్‌బస్టర్‌ కాదు. ఇక రెండేళ్ల కిందట సుకుమార్‌ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా నటించిన '1' (నేనొక్కడినే) చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరపరాజయం పాలైంది. ఈ విధంగా చూస్తే అటు ఎన్టీఆర్‌కు, ఇటు సుకుమార్‌కు సంక్రాంతి పెద్దగా అచ్చిరాలేదని చెప్పవచ్చు.

అయితే 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో ఆ సెంటిమెంట్‌ను బద్దలు చేసి ఘనవిజయం సాధించాలని ఎన్టీఆర్‌, సుక్కులు కసితో ఉన్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి ఇండస్ట్రీలో మంచి పాజిటివ్‌ బజ్‌ ఉంది. మరోపక్క బాబాయ్‌ 'డిక్టేటర్‌' చిత్రంతో సంక్రాంతికే రానున్నాడు. బాలయ్యకు సంక్రాంతి ఎంతో బాగా కలిసొచ్చిన సీజన్‌. ఈ పండగకు రిలీజైన బాలయ్య చిత్రాలు కొన్ని చరిత్రను తిరగరాశాయి. ఇక నాగార్జున కూడా సంక్రాంతికే 'సోగ్గాడే చిన్నినాయన' ద్వారా వస్తున్నాడు. నాగ్‌కు కూడా సంక్రాంతి పెద్దగా అచ్చిరాలేదనే చెప్పాలి. మరి ఈ 'నాన్నకు ప్రేమతో' చిత్రం ఎన్టీఆర్‌, సుకుమార్‌ల ఆశలను ఏవిధంగా నిజం చేస్తుందో చూడాలి...! అందులోనూ ఈ చిత్రం ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం కావడం మరో మరో విశేషం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ