ఎంత సంపాదిస్తే ఏం లాభం, చివరాఖరికి జగపతిబాబు పరిస్థితి ఆర్థికంగా బాగా చితికిపోయింది అన్న న్యూస్ ఒకానొక సమయంలో విపరీతంగా వ్యాప్తి చెందింది. అటు కెరీర్ అసలు బాగోలేక, ఇటు చేతిలో డబ్బులూ లేక ఈయన అనుభవించిన ఫ్రస్ట్రేషన్ కొందరికే తెలుసు. కానీ జగపతిబాబు గారి సంపాదనంతా ఆయనొక్కడే అనుభవించకుండా తోటి వారికి ముఖ్యంగా ఆయనతో పనిచేసే అసిస్టెంట్ దర్శకులకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు అని మొన్న దర్శకుడు సుకుమార్ చెబితేగానీ చాలా మందికి తెలీదు. జగపతిబాబు సినిమా అంటే అసిస్టెంట్ దర్శకులకు పండగే పండగ. ప్రతిరోజూ సాయంత్రం షూటింగ్ అయిపోయి ప్యాకప్ చెప్పే సమయానికి ఆయన చుట్టూరా డైరెక్షన్ టీం వారు మూగేవారు. ఎందుకంటే జగపతిబాబు చేతికి ఎముక లేదన్నంత రేంజులో ఎంజాయ్ చేసుకోమని వీళ్ళకి డబ్బులు పంపిణీ చేసేవారు. ఇది సుకుమార్ స్వయానా చూసాడు గనకనే లండన్ అండ్ యూరప్ దేశంలోని ఇతర నగరాల్లో నాన్నకు ప్రేమతో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈవెనింగ్ సమయంలో జగపతిబాబు వెంట ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా జాగ్రత్త పడేవాడంట. అదీ మన హ్యాండ్సమ్ విలన్ దానగుణం. ది కర్ణ ఆఫ్ టాలివుడ్.