Advertisementt

లుక్కులతోనే చంపేశారు పో...

Tue 29th Dec 2015 02:32 PM
jr ntr nannaku prematho,balakrishan dictator,nagarjuna soggade chinni nayana  లుక్కులతోనే చంపేశారు పో...
లుక్కులతోనే చంపేశారు పో...
Advertisement
Ads by CJ

సంక్రాంతికి రానున్న ముఖ్యమైన మూడు చిత్రాలలోనూ మన బడా స్టార్ హీరోలు నటించడం ఆనందదాయకం. పొంగల్ అంటే తెలుగు సినిమా పిచ్చోల్లకు నిజమైన పండగ సీజన్. అందుకే మూకుమ్మడిగా ముగ్గురు హీరోలు కట్టకట్టుకొని బాక్సాఫీస్ మీద దాడికి దిగుతున్నారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రాల ఫలితం రేపు విడుదల తరువాత ఎలాగున్నా ప్రస్తుతానికి మాత్రం డిక్టేటర్లో బాలకృష్ణ, నాన్నకు ప్రేమతోలో జూనియర్ ఎన్టీయార్, సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున గెటప్పులు అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. ముగ్గురూ అందగాళ్ళే అయినా పాత్రోచితంగా వీళ్ళు చేసుకున్న వేషధారణతోనే సినిమాలకు సగం ప్రమోషన్ జరిగిపోయింది. ముఖ్యంగా జూనియర్ చేయించుకున్న బ్రెజిల్ స్టైల్ హెయిర్ కట్, బాలకృష్ణ రిచ్ మాఫియా డాన్ లుక్కు అలాగే తండ్రి అక్కినేని నాగేశ్వర రావు గారి పంచె కట్టును ఉన్నది ఉన్నట్టుగా దించిన నాగార్జున... ఇలా ముగ్గురూ తమలోని భిన్నమైన పార్శ్వాలని మన ముందు ఉంచారు. ఇందుకు గాను స్టైల్ డిపార్టుమెంటు వారికి నిర్మాతలు, దర్శకులు రుణపడి ఉండాల్సిందే. సో ఫార్, ముగ్గురి హీరోల ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీస్... 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ