Advertisementt

తప్పు తెలుసుకుంటోన్న అక్కినేని బుల్లోడు!

Tue 29th Dec 2015 02:00 PM
akhil akkineni,akhil movie,devakatta,krish,nagarjuna  తప్పు తెలుసుకుంటోన్న అక్కినేని బుల్లోడు!
తప్పు తెలుసుకుంటోన్న అక్కినేని బుల్లోడు!
Advertisement
Ads by CJ

అక్కినేని వంశాంకురం అఖిల్‌ మొదటి సినిమాతోనే ఆకాశానికి నిచ్చెన వేశాడు. కానీ ఆయన మొదటి చిత్రం 'అఖిల్‌' బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. మొదటి సినిమాతోనే స్టార్‌డమ్‌ సాదించాలని, తనదైన శైలిలో మాస్‌ హీరో ఇమేజ్‌ తెచ్చుకుని రాత్రికి రాత్రి స్టార్‌హీరో కావాలని ఆయన ఆశపడ్డాడు. దీంతో మొదటి చిత్రానికే భారీగా హైప్‌ క్రియేట్‌ చేస్తూ వెళ్లాడు. వారసులుగా పరిచయం అయిన మహేష్‌బాబు, పవన్‌కళ్యాణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌.. ఇలా వీరందరూ మొదటి సినిమాతోనే చేయని అటెంమ్ట్‌ను అఖిల్‌ తొలి సినిమాలోనే చేశాడు. కానీ భారీషాక్‌ తగలడంతో ఇప్పుడు తన రెండో సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇప్పటికీ ఆయన తన రెండో చిత్రం ఏ దర్శకుడితో... ఎలాంటి చిత్రం చేయాలో తెలియని తికమకలో ఉన్నాడు. దేవకట్టా, క్రిష్‌ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఆయన యాక్షన్‌ చిత్రమే చేయాలా? లేక సాఫ్ట్‌ లవ్‌స్టోరీ చేయాలా? అనేది తేల్చుకోలేని సందిగ్దావస్థలో ఉన్నాడు. మరి తండ్రి నాగార్జునతో పాటు అఖిల్‌లు ఎలాంటి చిత్రం చేయాలని భావిస్తున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. మరి అఖిల్‌ చేసే తదుపరి చిత్రం ఎలా ఉంటుంది? అనే విషయమై అక్కినేని అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ