నందమూరి బాలకృష్ణ అంటేనే ఓ చిన్న చిలిపి కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఎందుకంటే హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో ఈయన బాడీ లాంగ్వేజు భలే పసందుగా ఉంటుందిలెండి. అందుకే కాబోలు వయసు పైన బడుతున్నా ఈయన హీరోయిన్లతో వేసే చిలిపి వేషాల మీద దర్శకులు శ్రద్ధ పెట్టి కొంచెం ఘాటైన మాసాలా సీన్లు రచయితలను కూర్చోబెట్టి మరీ రాయించేస్తుంటారు. మొన్నయితే డిక్టేటర్ సినిమా ప్రారంభం రోజున మీడియా అందరి ముందు నటి అంజలిని ఎక్కడెక్కడో గిల్లేసి ఆమెకు వలపు పులకింతలు రేపాడు. ఆఫ్ స్క్రీన్ పైనే బాలకృష్ణ ప్రతాపం ఇలా ఉంటె ఆన్ స్క్రీన్ మీద ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. అందుకేనేమో బాలయ్య సత్తాను ఈ విషయంలో స్వయంగా చుసిన దర్శకుడిగా శ్రీవాస్ ఇద్దరు రాటుదేలిన పసందైన భామామణులు శ్రద్ధా దాస్, ముమైత్ ఖాన్లను పిలిపించి డిక్టేటర్ ఐటెం సాంగు కోసం బాలయ్య మీదకి ఉసిగొలిపాడు. టింగో టింగో అంటూ సాగే ఈ పాటలో ఇదిగో పైన చూస్తున్నారుగా బాలకృష్ణుడు ఇద్దరినీ ఎంత గట్టిగా అదిమి పట్టేసుకున్నాడో, పాటేసుకున్నాడో. అంజలి, సోనాల్ చౌహన్, శ్రద్ధా దాస్, ముమైత్ ఖాన్... అదీ బాలయ్య లెక్క!