ఒక రచయిత నుండి సూపర్ రచయిత స్థాయికి చేరుకొని ఆ తరువాత సూపర్ హిట్ దర్శకుడిగా అందరి మనసులు గెలుచుకున్న కొరటాల శివ ఇప్పుడు జూనియర్ ఎన్టీయార్ గారితో జనతా గ్యారేజీ అనే సినిమా మొదలు పెట్టబోతున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే. నిజానికి జనతా గ్యారేజీకి ఎప్పుడో ముహూర్తం పడింది, అయినా కేవలం నాన్నకు ప్రేమతో మొత్తం పూర్తయిన తరువాతే షూటింగ్ మొదలు పెడదామని ఎన్టీయార్ అనడంతో కొరటాల స్క్రిప్టును మరింత పకడ్బందీగా రూపుదిద్దె పనిలో నిమగ్నం అయ్యాడు. నాన్నకు ప్రేమతో కోసం సుకుమార్ తీసుకున్న సబ్జెక్టు, రాసుకున్న డైలాగులు తెలిసే వరకు నా కథకు నేను మామూలుగానే కథనం, మాటలు రాసుకున్నాను. కానీ ఒక్కసారి ఆ కథలోని విషయం అర్థమయిన తరువాత జనతా గ్యారేజీకి మరింతగా అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఎందుకంటే ఎన్టీయార్ గారి స్టామినాకి సరిపడే రోల్ ఇవ్వడానికి, అని కొరటాల శివ తాను పడుతున్న కష్టం గురించి వివరించారు. చెప్పాలంటే ఎన్టీయారుకి కొరటాల అంటే ఎనలేని అభిమానం. ఎన్టీయార్ కోసం చేసిన బృందావనం సినిమాకు రాసిన మాటలతోనే కొరటాలకు రచయితగా మంచి బ్రేక్ వచ్చింది. అప్పటి నుండి వారిద్దరి మధ్య ఒక రిలేషన్ కుదిరింది.